హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను భువనగిరి ఎస్వోటీ, పోచంపల్లి పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు.
అల్లూరి సీతారామారాజు జిల్లాకు చెందిన గమ్మెలి గోవిందరావు, కొర్ర రమేశ్‌బాబు స్థానికంగా చంటి, లక్ష్మీనాయుడు వద్ద ఈ నెల 26న 10.2 కిలోల హాష్‌ఆయిల్ కొని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు వచ్చి కొత్తగూడ ఎక్స్‌రోడ్డులో దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గోవిందరావు, రమేశ్‌బాబును అరెస్ట్ చేసి, రూ. 1.52 కోట్ల విలువైన 10.2 కిలోల హాషీష్ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన వాల్మీక్, దేవారాం ఏపీలోని విశాఖపట్టణంలో తిరుపతితో కలిసి 25న పెందుర్తిలో 60 కిలోల గంజాయి కొని కారులో మహారాష్ట్రకు బయలుదేరారు. మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు ఇబ్రహీంపట్నం మండలం రైపోల్పరిధిలో తనిఖీ చేయగా రూ. 35 లక్షల విలువైన 60 కిలోల గంజాయి ప్యాకెట్లు లభించగా నిందితులను అరెస్ట్ చేశారు.