హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే, తెలంగాణ): కెమిస్ట్రీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ కల్పించేందుకు బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ)తో తెలంగాణ ఉన్నత విద్యామండలి శనివారం ఒప్పందా న్ని కుదుర్చుకుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఇరు సంస్థలు ఒప్పంద ప త్రాలు మార్చుకున్నాయి.
దీంతో కెమిస్ట్రీతో పాటు ఫార్మసీ, కెమికల్, మెకానిక ల్ ఇంజినీరింగ్ కోర్సుల్లోని విద్యార్థులకు ఇంటర్న్ షిప్స్, ఉద్యోగాలు కల్పించనున్నా రు. విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, బీడీఎంఏ అధ్యక్షుడు ఆర్కే అగర్వాల్ పాల్గొన్నారు.