పాపన్నపేట, సెప్టెంబర్ 28: నదులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ అధ్యక్షులు ప్రొఫెసర్ మణికొండ వేదకుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ నదుల దినోత్సవం సందర్భంగా ఫోరం ఆధ్వర్యంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, గవర్నమెంట్ సిటీ కాలేజీ వారితో ఏడుపాయల వద్ద మంజీరా నదిని సందర్శించి ‘నదితో నడక’ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్చమైన నదులను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సుమారు 100 దేశాల్లో ఈ నదుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రూప్-1 ఆఫీసర్ కరిపె రాజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ప్రొఫెసర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఫోరం సభ్యుడు వేణుగోపాల్ మాట్లాడుతూ నదులను కాపాడితే మనల్ని కాపాడుకున్నట్టేనని చెప్పారు. కార్యక్రమంలో నీటి నిల్వ పద్ధతుల నిపుణులు సుభాష్, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, వెంకన్న, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు సంతోష్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఎం హెచ్ రావు, డా. రమ, డా. పద్మ, సుతారావు, వెంకటనారాయణ, నరేందర్, కేటీసీబీ సభ్యులు తెలిపారు.