ఇవాళ్టి బతుకమ్మ .. సద్దుల బతుకమ్మ
బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు. అలసిన అమ్మవారికి ఘనమైన పాకాలు నివేదన చేస్తారు భక్తులు.
బతుకమ్మ ఉత్సవానికి ఘనమైన ముగింపు పలుకుతుంది సద్దుల పండుగ. దుర్మార్గుడైన దుర్గముడు అనే రాక్షసుణ్ని సంహరించి, సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి.. దుర్గామాతగా కొలువుదీరిన మహోన్నతమైన రోజు ఇది. అందుకే ఈ రోజును దుర్గాష్టమిగా జరుపుకొంటారు. అలసిన అమ్మవారికి ఘనమైన పాకాలు నివేదన చేస్తారు భక్తులు. ‘పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీతి మానసా’ అంటూ అమ్మకు రకరకాలైన నైవేద్యాలు సమర్పిస్తారు. గ్రామీణులు సద్దుల పేరుతో పులగం, పులిహోర, చిత్రాన్నం, నువ్వులసద్ది, కొబ్బరిసద్ది, పెరుగన్నం ఇలా వివిధ రకాలైన సద్దులు చేస్తారు. అందుకే చివరి రోజు వేడుకకు సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. దీనినే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. మిగతా రోజులకన్నా భిన్నంగా, పెద్ద పెద్ద బతుకమ్మలు పేరుస్తారు. సాయంత్రం కాగానే పిల్లాజెల్లా అందరూ బతుకమ్మ ఆడటానికి అందంగా ముస్తాబై కదలివస్తారు. మగవాళ్లు సైతం ఈ ముచ్చటను చూసేందుకు ఉత్సాహం కనబరుస్తారు. ఊరంతా చెరువు కట్టకు ఊరేగింపుగా తరలివెళ్తారు.
‘తంగేడు పూవుల్ల చందమామ.. బతుకమ్మ పోతుంది చందమామ
పోతె పోతివిగాని చందమామ.. మళ్లెప్పుడొస్తావు చందమామ
ఏడాదికోసారి చందమామ.. నువ్వొచ్చి పోవమ్మ చందమామ’ అంటూ తమకు బతుకునిచ్చిన పరమేశ్వరికి ఘనంగా వీడ్కోలు పలుకుతారు.
డా॥ ఆర్.కమల
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

