హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 21న పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యోగాధ్యాన పరిషత్ సెక్రటరీ ఎం ప్రశాంతి శనివారం తెలిపారు. 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హైదరాబాద్లోని సంజీవయ్య పార్కు వద్ద యోగా దినోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ నెల 18 నుంచి 21 వరకు యోగ, ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసినట్టు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తారని వెల్లడించారు.