జూలపల్లి, డిసెంబర్ 14 : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటకు చెందిన ప్రముఖ కవి, రచయిత, డాక్టర్ చెమన్సింగ్కు వైద్యరంగంలో అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి అనుంబంధ సంస్థ ‘ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్’ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 9 మందిని ఎంపికచేసి అవార్డులు ప్రకటించింది.
ఆల్టర్నేటివ్ మెడిసిన్ విభాగంలో చెమన్కు చోటు కల్పించడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో నిర్వహిస్తున్న ‘హ్యూమన్ రైట్స్ డే’ సదస్సులో చెమన్ ‘హ్యూమన్ రైట్స్ క్రూసడర్ అవార్డు-2024’ అందుకోనున్నారు.