హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష హాల్‌టికెట్లను ఇంటర్‌బోర్డు శనివారం విడుదల చేసింది. పరీక్ష ఫీజు చెల్లించిన 4.12 లక్షల మంది విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచింది.
కాలేజీ ప్రిన్సిపాళ్లకు సైతం హాల్‌టికెట్లు పంపించింది. ఈ నెల 22 నుంచి 29 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇంటర్‌బోర్డు 892 సెంటర్లు ఏర్పాటు చేసింది.