హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ముగిశాయి. మే 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు మంగళ, బుధవారాల్లో ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఈ నెలాఖరులో ఫలితాలను విడుదల చేస్తారు.