హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ప్రశ్నపత్రాల్లో తప్పుల మీద తప్పులు, అక్షరదోషాలు, అన్వయ దోషాల మధ్య ఇంటర్ వార్షిక పరీక్షలు సజావుగా ముగిశాయి. మార్చి 5న ప్రారంభమై మంగళవారంతో పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 19 స్పాట్ వాల్యుయేషన్ క్యాంపుల్లో మూల్యాంకనం ప్రారంభంకాగా, ఏప్రిల్ 10తో పూర్తికానున్నది. ఏప్రిల్ మూడో వారంలో ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ పేపర్లో 7వ ప్రశ్న మసమసకగా(అస్పష్టంగా) ముద్రితమైంది. దీంతో ఈ ప్రశ్న రాయడానికి ప్రయత్నించిన వారికి నాలుగు మార్కులు ఇవ్వనున్నారు. అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ సరిగ్గా రాయకున్నా 4 మార్కులేస్తారు.