హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. జనరల్ విద్యార్థుల కోసం 1,812, వొకేషనల్ విద్యార్థుల కోసం 463 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసింది.
మల్క కొమురయ్యకు బీసీటీఏ మద్దతు
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. శనివారం హైదరాబాద్‌లో మల్క కొమురయ్యను బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం కలిసి మద్దతు లేఖను అందజేసింది.