హైదరాబాద్ : నగరంలోని కేపీహెచ్‌బీ ( KPHB ) పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య (Students Suicide) చేసుకోవడం కలకలం రేపుతుంది. కళాశాలలో ర్యాగింగ్ ( Ragging ) భరించలేక ఇగ్నైట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రీకేతన్ విద్యార్ధి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి
ర్యాగింగ్ భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధి
హైదరాబాద్ – కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ ప్రాంతంలో ఉన్న ఇగ్నైట్ జూనియర్ కళాశాలలో, ర్యాగింగ్ భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న శ్రీకేతన్… pic.twitter.com/xulngHoMIs
— Telugu Scribe (@TeluguScribe) December 17, 2025
తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడం వెనుకు అనుమానాలు రేకెత్తుతున్నాయి . మృతుడి తండ్రి మాట్లాడుతూ కళాశాల సిబ్బంది జరిగిన ఘటనను చెప్పగానే కళాశాలకు బయలు దేరామని, తాము కళాశాలకు చేరకుండానే మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు. తన కుమారుడు ఆరు అడుగుల ఎత్తు ఉంటాడని కిటికికి ఉరివేసుకుని ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానం వ్యక్తం చేశారు.
కళాశాలలో కుమారుడిని చేర్చినపుడు కేవలం 120 మంది మాత్రమే ఉన్నారని, సీనియర్స్ లేరని యాజమాన్యం చెప్పిందని అన్నారు. సీనియర్స్‌తో లేదా సహచరుల ర్యాగింగ్‌తో వేధింపులకు గురై చనిపోయాడో తేల్చాలని, తన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాలేజ్ వద్ద విద్యార్థి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.