HomeTelanganaInter First Year Exams Started Across The Telangana Form Today
Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా మొదలైన ఇంటర్ పరీక్షలు.. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో సీసీ కెమెరాలు!
Inter Exams | రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. బుధవారం నాడు ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్-1కు పరీక్ష జరుగుతున్నది.
2/16
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటలపాటు పరీక్ష జరగనుంది.
3/16
విద్యార్థులను గంట ముందు నుంచే అంటే ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.
4/16
ఉదయం 8.45 గంటలకు ఓఎమ్మార్‌షీట్ అందజేశారు. అయితే 9:05 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన వారిని కూడా లోనికి అనుమతించారు.
5/16
గురువారం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి.
6/16
ఇంటర్ పరీక్షలకు వచ్చే విద్యార్థులకు వాచ్‌లు, సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ముద్రిత సామగ్రిని లోనికి అనుమతించలేదు.
7/16
కాగా, ఈ పరీక్షల కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకంగా స్మార్ట్ నిఘా పెట్టింది.
8/16
45 పరీక్షా కేంద్రాలకు ఒక బృందం చేత సీసీసీ నిఘా పెట్టారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
9/16
ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.
10/16
ఫస్టియర్‌లో 4,88,448 విద్యార్థులు, సెకండియర్‌లో 5,08,523 విద్యార్థుల చొప్పున 9,96,971 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
11/16
వీరిలో గతంలో ఫెయిలైన 67,735 మంది విద్యార్థులు కూడా పరీక్షలకు హాజరుకాబోతున్నారు.
12/16
పరీక్షల కోసం 29,992 మంది ఇన్విజిలెటర్లు, 72 మంది ప్లయింగ్‌స్కాడ్, 124 సిట్టింగ్ స్కాడ్‌లకు విధులు కేటాయించారు. ఇంటర్‌బోర్డు అబ్జర్వర్లను (పరిశీలకులు) సైతం రంగంలోకి దించనున్నది.
13/16
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన విద్యార్థులు
14/16
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన విద్యార్థులు
15/16
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన విద్యార్థులు
16/16
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన విద్యార్థులు
17/16
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన విద్యార్థులు