హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ క్వశ్చన్ బ్యాంక్ మిస్సింగ్ వార్తలపై ఇంటర్‌బోర్డు స్పందించింది. క్వశ్చన్ బ్యాంక్ మిస్సింగ్ వార్త నిజం కాదని, జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని ఇంటర్ బోర్డు కమిషనర్ శ్రీదేవసేన ప్రకటనలో తెలిపారు. క్వశ్చన్ బ్యాంక్ మిస్సింగ్‌పై సోషల్ మీడియాలో పుకార్లు, మీడియాలో వార్తలు రావడంతో శుక్రవారం వివరణ ఇచ్చారు.