హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఒకరోజు ఫస్టియర్స్కు, మరుసటిరోజు సెకండియర్స్కు పరీక్షలుంటాయి. ఇక ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను సైతం బోర్డు విడుదల చేసింది. శనివారం(నవంబర్ 1 నుంచి) విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చు. ఈ మేరకు శుక్రవారం ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్, పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య విడుదల చేశారు.
రెండేండ్లలో రూ.130 పెంపు..
ఇంటర్ విద్యార్థులపై ప్రభుత్వం ఫీజుల భారం మోపింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజులను ఈసారి రూ.110 పెంచింది. నిరుడు రూ.20 పెంచగా, ఈసారి ఏకంగా రూ.110 వడ్డించింది. ఇక తొలిసారిగా ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ ప్రాక్టికల్స్ కోసం రూ.100 వసూలు చేయనున్నట్టు ఇంటర్‌బోర్డు పేర్కొన్నది. మొత్తంగా ఈ రెండేండ్లలో పరీక్ష ఫీజులు రూ.130 పెరిగింది. ఫస్టియర్ ఆర్ట్స్, సైన్స్ కోర్సుల ఫీజులు రూ.520 ఉండగా, ఈసారి రూ.10 పెంచి, రూ.530చేశారు. దీనికి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఫీజు రూ.100 కలిపితే మొత్తం రూ.630 కానున్నది. సెకండియర్ ఆర్ట్స్‌వారు సైతం రూ.630 చెల్లించాల్సి ఉంటుంది. అదే సెకండియర్ సైన్స్, వోకేషనల్ విద్యార్థులు రూ. 870 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వీరు పరీక్ష ఫీజుగా రూ.530, సైన్స్ ప్రాక్టికల్స్‌కు రూ.240, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌కు రూ.100 కలిపి మొత్తం రూ.870 చెల్లించాలి.
జేఈఈ మెయిన్స్ రోజే..
ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు, జేఈఈ మెయిన్-1 పరీక్షలు ఒకే షెడ్యూల్లో జరుగనున్నాయి. ఫస్టియర్ వారికి 2026 జనవరి 21న, సెకండియర్ వారికి జనవరి 22న నిర్వహిస్తారు. ఇదే తేదీల్లో జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు జరుగనున్నాయి. అయితే దీనిపై విద్యార్థులు టెన్షన్ పడాల్సిన అవసరంలేదని ఇంటర్‌బోర్డు తెలిపింది. జేఈఈ, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఏకకాలంలో ఉంటే సం బంధిత విద్యార్థులకు ప్రత్యేక ప్రొవిజన్ కింద ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేస్తామని వెల్లడించింది. ఇక సెకండియర్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలను 2026 ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు నిర్వహిస్తారు. ఆదివారాల్లోనూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇవి ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో జరుగుతాయి. ఇక ఇంటర్నల్ పరీక్షలైన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను 2026 జనవరి 23న నిర్వహిస్తారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్‌ను 2026 జనవరి 24న నిర్వహించనున్నట్టు ఇంటర్‌బోర్డు వెల్లడించింది. ఫస్టియర్ పరీక్షలు ఇలా..
తేదీ(వారం) పరీక్ష
సెకండియర్ పరీక్షలు ఇలా.. తేదీ(వారం) పరీక్ష
పరీక్ష ఫీజు షెడ్యూల్