హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): నైని కోల్‌బ్లాక్ టెండర్ల వివాదం నేపథ్యంలో సింగరేణికి రెగ్యులర్ సీఎండీని నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. సీఎండీ పోస్టు కోసం మన రా్రష్ట్ర ఐఏఎస్‌లతోపాటు ఇతర రాష్ర్టాల కేడర్ అధికారులు తీవ్రంగా పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ పోస్టు కోసం రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్, తమిళనాడుకు చెందిన ఓ ఐపీఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌కు గతంలో ట్రాన్స్‌కోలో పనిచేసిన అనుభమున్నది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. వీరే కాకుండా రాష్ర్టానికి చెందిన మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం సీఎండీ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి రాగానే కొత్త సీఎండీపై ఓ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్నది.