గంగాధర, నవంబర్ 13 : కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లపై ఇంటలిజెన్స్ అధికారులు గురువారం విచారణ జరిపారు. రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఒకే సర్వే నంబర్లో ఒకరికి రిజిస్ట్రేషన్ చేసిన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ మరొకరికి నిరాకరించారు.
కొత్తపల్లి మండలం రేకుర్తి పరిధిలో ఒకే సర్వే నంబర్, ఒకే అపార్ట్మెంట్లో ఒకరికి మార్ట్గేజ్ చేసిన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ మరొకరికి సేల్ అగ్రిమెంట్ చేయడానికి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో ఆరోపణలు వచ్చాయి. అక్రమాల గురించి ప్రతికల్లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో సంబంధిత శాఖ అధికారులు స్పందించి సదాశివరామకృష్ణను ఇన్చార్జి బాధ్యతలను నుంచి తొలగించారు. ఇదే అంశంపై ఇంటలిజెన్స్ అధికారులు విచారణ చేశారు.