హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : ఏపీ ప్రభుత్వం నిర్మించబోయే బనకచర్ల ప్రాజెక్ట్‌తో తెలంగాణకు అన్యాయం జరుగనున్నదని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కో దండరాం తెలిపారు. ఆదివారం ఆయన మా ట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుతో కృష్ణా, గోదావరి జలాల్లో వాటా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కృష్ణానదిపై ఇప్పటికే ఏపీ అనేక ప్రాజెక్టులు నిర్మించి విచ్చలవిడిగా నీటిని తరలించుకుపోతున్నదని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.