నిడమనూరు, జూలై 19 : కాంగ్రెస్ ప్రభుత్వం షరతులతో కూడిన రుణమాఫీ చేయడంతో అర్హులైన పేద రైతులకు అన్యా యం జరుగుతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.
సాంకేతిక కారణాలతో ధరణిలో నమోదు కాని భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ కాలేదని, ఈ కారణంగా రైతులకు రుణమాఫీ వర్తింప చేయకపోవడం సరికాదని హితవుపలికారు. పంట పెట్టుబడుల కోసం పేద రైతులు, కౌలు రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగారని, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారని తెలిపారు. వారందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీ ఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేశ్ ఉన్నారు.