హైదరాబాద్, సెప్టెంబర్16 (నమస్తే తెలంగాణ) : జూనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి పరీక్షలు రాసిన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, అందుకు ప్రస్తుత నోటిఫికేషన్‌లోని నిబంధనలే అడ్డంకిగా మారాయని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు.
ప్రభుత్వం వెంటనే నిబంధనలు సవరించి ఓబీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, వీ హన్మంతరావు, జస్టిస్ చంద్రకుమార్, జకుల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.