హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డికి సమాచార, పౌర సంబంధాల శాఖ, గనులు భూగర్భవనరుల శాఖను కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్‌రెడ్డి గురువారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.