డిస్పూర్ (అస్సాం): వ్లాగ్‌లు చేసే ఇన్ఫ్లూయెన్సర్లు చిన్నారుల వీడియోలు, ఫొటోలను కూడా వదలడం లేదు. అయితే ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరిస్తున్నారు అస్సాం పోలీసులు. ఇలా చేయడం వ ల్ల వారి గోప్యత దెబ్బ తింటుందని హెచ్చరిస్తున్నారు. బాలలను ఇలా వ్యూస్ కోసం ఉపయోగించడం వారికి హాని కలిగిస్తుందని తెలిపారు. దీని కోసం పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో రూపొందించిన పిల్లల చిత్రాలను ఉపయోగించడం గమనార్హం. నెటిజన్లను ఆకర్షించడం కోసం పిల్లల గోప్యతతో వ్యాపారం చేయవద్దని.. వారి గురించి చెప్పే అవకాశం వారికే కల్పించండని వినూత్న ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో వినోదానికి మీ పిల్లలేమీ ఆట వస్తువులు కాదు అని తల్లిదండ్రులకు హెచ్చరికలు కూడా చేశారు. అస్సాం పోలీసుల ప్రచారానికి ప్రజల నుంచి అభినందనలు వస్తున్నాయి.