అయిజ, జూలై 24 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. శుక్రవారం టీబీ డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 19,250 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 3,189 క్యూసెక్కులు నమోదైంది. గరిష్ఠ నీటి మట్టం 1633 అడుగులకుగానూ ప్రస్తుతం 1605.47 అడుగుల నీటిమట్టం ఉండగా.. 105.788 టీఎంసీల సామర్థ్యానికిగానూ ప్రస్తుతం 29.471 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.