అడ్డగూడూరు, ఆగస్టు 4 : ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మొదటి ప్రాధాన్యత కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సూర్యాపేట జిల్లా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవికాల్వలో ఆదివారం పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. అంతకుముందు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైనట్టు తెలిపారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ముందుగు ఇండ్లు ఇవ్వాలని, ఆ తరువాత ఇతర పార్టీల వారికి ఇవ్వాలని సూచించారు.