Hailstorm | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. సోమవారం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానంపై వడగండ్లు బీభత్సం సృష్టించాయి. గాల్లో ఉండగానే జరిగిన ఈ ఘటనతో విమానం ముందు భాగం, కాక్పిట్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
పైలట్ చాకచక్యంగా వ్యవహరించి శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.