న్యూయార్క్: హైదరాబాద్‌కు చెందిన 28 ఏళ్ల మొహమ్మద్ వాజిద్(Mohammed Wajid).. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మసాచుసెట్స్‌లోని ప్లైమౌత్ కౌంటీలో జనవరి 28వ తేదీన ఆ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అతని స్వస్థలం. అమెరికాలోని ఎన్ఆర్ఐ మైనార్టీ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు అతను. చికాగోలో అతను మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.
వాజిద్ సెమీ ట్రక్కు డ్రైవ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. క్రాసింగ్ స్టాప్ సైన్ వద్ద ఆగకుండా అతని ట్రక్కు దూసుకెళ్లింది. ఆ వేగంతోనే మరో ట్రక్కును ఢీకొట్టింది. వాజిద్ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఆస్పత్రికి తీసుకెళ్లినా.. వాజిద్ మృతిచెందినట్లు తేల్చారు. మరో ట్రక్కు నడిపిస్తున్న డ్రైవర్ తిమోతీ విల్కిన్ క్షేమంగా ఉన్నాడు.
ప్రమాద సమయంలో స్వల్పంగా మంటలు వ్యాపించాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో వాజిద్ దిగిన ఫోటోను తెలంగాణ కాంగ్రెస్ కార్యదర్శి షాహబుద్దీన్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
#VerySadNews #GoneTooSoon
Today is a sad day for me and our entire Congress family. We’ve lost a dear friend and colleague, Mohammed Wajid, in a tragic accident in Chicago, USA.Wajid was an active leader of the Youth Congress in Khairatabad Division and a member of the NRI… pic.twitter.com/AA1uWEafmA
— Mohammed shahabuddin (@mshahab31) January 29, 2025