మంత్రి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వంపై రా ష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్చేశారు. దేశ ప్రజలను మోసంచేస్తూ, తెలంగాణకు అన్యాయంచేస్తున్న కేంద్రంపై ధ్వజమెత్తారు.
‘దేశానికి కావాల్సింది డబుల్ ఇంపాక్ట్ పాలన.. పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు. దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ జీడీపీకి 5.0% కంట్రిబ్యూట్ చేస్తున్నది. ఈ గణాంకాలు 2021, అక్టోబర్లో ఆర్బీఐ విడుదలచేసిన నివేదికలో ఉన్నాయి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.