India Aging Report | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య 2036 నాటికి భారీగా పెరిగే అవకాశం ఉందని ‘ఇండియా ఏజింగ్ రిపోర్ట్’ వెల్లడించింది. 2021నాటికి రాష్ట్ర జనాభాలో 11 శాతం వృద్ధులు ఉన్నట్టు పేర్కొన్నది.
ఈ సంఖ్య 2036 నాటికి 17.1 శాతానికి పెరగనున్నట్టు పేర్కొన్నది. ఇది దేశ సగటుకన్నా ఎక్కువ కావడం గమనార్హం. తెలంగాణలో 60 ఏండ్లు దాటినవారిలో మహిళలు సగటున మరో 18.3 సంవత్సరాలు జీవిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. అదే సమయంలో 60 ఏండ్లు దాటిన పురుషులు సగటున మరో 17.3 ఏండ్లు జీవిస్తున్నట్టు పేర్కొన్నది.