BRAOU | హైదరాబాద్, ఏప్రిల్ 29 : యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవధిక సమ్మె తొమ్మిదో రోజు మంగళవారం కొనసాగింది. యూనివర్సిటీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. టెక్నికల్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రతినిధులు డా. యాకేష్ దైద , భరత్ రెడ్డి మద్దతు పలికారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం అధ్యక్షుడు డా. కె. అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలు జరిపి యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరారు. క్రమబద్దీకరణ ప్రకియ చేపట్టేలోపు యూజీసీ పే స్కేల్ (బేసిక్, డిఎ, హెచ్ఆర్ఎ, 3 శాతం ఇంక్రిమెంట్) ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం సలహాదారులు డా. యాదగిరి కంభంపాటి, డా.నరసింహులు, డా, కాసం విజయ్, డా. ఎం నాగరాజు, డా. అరవింద కుమార్, డా. అరుణ, డా. విజయ ఉషశ్రీ, డి. శ్రీవేణి, కాంట్రాక్టు అధ్యాపకులు డి. కోటేశ్వర రావు, డా. పడాల లక్ష్మణ్, డా. సునీల్ కుమార్, రాజా గౌడ్, పీ. రాధాకృష్ణ, నర్సయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.