హైదరాబాద్, జనవరి 19 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. చలితోపాటు పొగమంచు అధికంగా ఉంటుంది. తెల్లవారుజామున ప్రారంభమై పది గంటల వరకూ ఉంటున్నది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లేవారు మాస్కులు ధరించాల్సి వస్తున్నది. రాష్ట్రంలో అత్యధికంగా 28 డిగ్రీలు, అత్యల్పంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.