Visa | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): స్టూడెంట్ వీసా చార్జీలను ఆస్ట్రేలియా, బ్రిటన్ పెంచాయి. ఇదివరకు ఆస్ట్రేలియా వీసా ఫీజు 710 ఆస్ట్రేలియన్ డాలర్లు కాగా, ఈ మొత్తాన్ని 1,600 డాలర్లకు పెంచింది. గత ఫిబ్రవరిలో వీసా ఛార్జీలను బ్రిటన్ 624 పౌండ్ల నుంచి 1,035 పౌండ్లకు పెంచింది. బ్రిటన్, అమెరికా, కెనడా దేశాలతో పోల్చితే ఆస్ట్రేలియా వీసా చార్జీలు అధికంగా ఉండటం విశేషం.
అమెరికా వీసా చార్జీ 185 డాలర్లు మాత్రమే. కెనడా వీసా చార్జీ 150 డాలర్లు. గతంలో విద్యార్థుల్లో ఎక్కువ మంది అమెరికా తర్వాత బ్రిటన్కు వెళ్లేవారు. తాజాగా ఈ ట్రెండ్ ఆస్ట్రేలియాకు పాకింది. ఆస్ట్రేలియా ఏటా 2.6 లక్షల స్టూడెంట్ వీసాలను జారీచేస్తున్నది. పోస్ట్ స్టడీ వర్క్ వీసాల గడువును సైతం పొడిగించింది. తెలంగాణ నుంచి సైతం గణనీయంగా విద్యార్థులు ఆస్ట్రేలియాకు వెళ్తున్నారు.