హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : రిటైర్డ్ బొగ్గుగని కార్మికుల పింఛన్ మొత్తాన్ని పెంచాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. కోల్ పెన్షనర్స్‌కు పలు ప్రయోజనాలు వర్తింపజేయాలని విజ్ఞప్తిచేసింది. కోల్‌మైన్స్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్(సీఎంపీఎఫ్‌వో) 183వ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
రెడ్‌హిల్స్‌లోని సింగరేణిభవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేంద్ర బొగ్గుశాఖ కార్యదర్శి విక్రమ్‌దేవ్ దత్, అదనపు కార్యదర్శి రూపిందర్ బ్రార్, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, డైరెక్టర్లు సత్యనారాయణరావు, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. సింగరేణి ఉద్యోగుల సంఘం నేతలు సహా కోల్ పెన్షనర్స్ సంఘం నేతలు డీ రామచందర్‌రావు, వేణుమాధవ్ తమ సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు.