సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 18:31:44

ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంచాలి : మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆయిల్‌ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. నాంపల్లిలోని తెలంగాణ ఉద్యావనశాఖ శిక్షణా సంస్థలో ఆయిల్‌పామ్‌ సాగు ప్రోత్సాహంపై బ్యాంకర్ల కమిటీతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ఆయిల్‌ పామ్ సాగు, రైతులకు ప్రోత్సాహకాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ పామ్‌ పంట సాగు ఉద్ధృతం చేయాలని రైతులకు సూచించారు. ఎకరా సాగుకు మొదటి నాలుగేండ్లు రూ.1.38 లక్షలు ఖర్చు అవుతుందని, ఈ మొత్తంలో  ప్రభుత్వం రూ. 31.832 వరకు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. దేశంలో 8.25 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్ సాగులో ఉందని చెప్పారు. ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలనుకునే రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo