కొత్తూరు, సెప్టెంబర్ 20: డెంగీతో చిన్నారి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఎస్బీపల్లిలో చోటుచేసుకున్నది. తల్లిదండ్రులు, గ్రామస్థుల వివరాల ప్రకారం.. పర్తపు రమేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
రెండో కూతురు వాసుప్రియ(8)కు జ్వరం రావడంతో ఎస్బీపల్లికి పక్కనే ఉన్న కోళ్లపడకల్‌లో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమిండంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. వాసుప్రియ ఇంటి పరిసర ప్రాంతాల్లో చెట్లు, చెదారం ఉండటం, గ్రామంలో పారిశుధ్యం లోపించడం వల్లే డెంగీ వచ్చిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.