హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ పథకంలో తెల్ల రేషన్‌కార్డు అనే ది కేవలం కుటుంబాన్ని నిర్ణయించడానికి ప్రామాణికమేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ప్రభుత్వం దగ్గర అంద రి వివరాలు ఉన్నాయని, కుటుంబ నిర్ధారణ కాగానే రుణమాఫీని మిగతా వారికీ వర్తింపచేస్తామని తెలిపారు. 2018లో అవలంబించిన విధానాలే 2024లో అమలు చేస్తున్నామని చెప్పా రు. రుణమాఫీ కింద రూ.20 వేల కోట్లు ప్రకటించి రూ.13 వేల కోట్లు విడుదల చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే, ఏక కాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంటే హర్షించాల్సింది పోయి విమర్శించడం సరికాదని పేర్కొన్నారు.