PM Modi | హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రకృతిని నాశనం చేస్తూ, వన్యప్రాణులకు హానీ చేయడం ఇదే కాంగ్రెస్ పాలనగా మారిందని మండిపడ్డారు. హరియాణాలోని యమునా నగర్లో 800 మెగావాట్ల అధునాతన థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆయన సోమవారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.
2014 కంటే ముందు కాంగ్రెస్ పాలనను మనం అస్సలు మరిచిపోకూడదని మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయాలు అనేవి తమకు అధికారం కోసం కాదని.. ప్రజలకు సేవ చేయడానికి ఒక మాధ్యమం మాత్రమేనని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి అలా కాదని అన్నారు. ఒకసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే అన్ని పనులు నిలిచిపోయాయని తెలిపారు. కర్ణాటకలో అయితే ప్రతిదీ ఖరీదైనదిగా మారిపోయిందని అన్నారు. అవినీతిలో కర్ణాటకను దేశంలోనే నంబర్‌వన్‌గా మార్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సన్నిహితులే స్వయంగా చెబుతున్నారని తెలిపారు.
ఇక గ్యారంటీలో పేరుతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. హామీల అమలును వదిలేసి, అడవులపై బుల్డోజర్లను నడిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిజీగా ఉందని మండిపడ్డారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే, వాళ్లు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
#WATCH | Yamuna Nagar, Haryana | Prime Minister Narendra Modi says, “For us, politics is not a medium for power but service and hence what BJP said it does… What is happening in the state ruled by Congress? They are betraying the people… In Karnataka, everything is getting… pic.twitter.com/tM90i6kAKo
— ANI (@ANI) April 14, 2025