విశ్వనగరమైన హైదరాబాద్లో పల్లె గుర్తులు నగరవాసులను అలరిస్తున్నాయి. బేగంపేట పైవంతెనకు పల్లె ప్రజల జీవితాన్ని ఆవిష్కరిస్తూ తీర్చిదిద్దిన కళాకృతులు నగరవాసులకు పల్లె వాతావరణాన్ని గుర్తు చేస్తున్నాయి. రణగొన ధ్వనుల మధ్య సాగే పట్నంవాసుల హడావుడి జీవితాలకు పల్లె జీవన చిత్రాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.