ఇచ్చోడ;ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ కాన్పులు చేసేందుకే వైద్యులు మొగ్గుచూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యాధికారి ఆకుదారి సాగర్ ఆధ్వర్యంలో బుధవారం ఏడుగురికి సాధారణ కాన్పులు చేశారు. ఒకే రోజు ఇంతమందికి సాధారణ కాన్పులు నిర్వహించడం దవాఖానలో ఇదే తొలిసారి అని సిబ్బంది పేర్కొన్నారు.