భైంసా, డిసెంబర్ 27: అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పత్తి ధర పైపైకి చేరుతున్నది. గత కొంత కాలంగా క్వింటాల్ పత్తికి ఎనిమిది వేల పైచిలుకు ధర పలుకుతున్నది. సోమవారం నిర్మల్ జిల్లా భైంసాలో క్వింటాల్ పత్తికి రూ.8,650 ధర దక్కింది. గత మూడేండ్లలో ఎన్నడూ లేనంతగా పత్తికి అత్యధిక ధర పలుకుతుండటంతో రైతులు సంబురపడుతున్నారు.