హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఏపీలో టీడీపీ ఐదుస్థానాల్లో అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర స్థానాల్లో ఈ మార్పులు జరిగాయి. ఉండి అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజుకు అవకాశం దక్కింది. ఆయనతో పాటు గిడ్డి ఈశ్వరి (పాడేరు), బండారు సత్యనారాయణమూర్తి(మాడుగుల), ఎంఎస్రాజు (మడకశిర), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి)కు టికెట్లు ఖరారు చేశారు.
అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు బీ ఫాంలు అందజేశారు. ఉండి నుంచి రఘురామకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.