ఖైరతాబాద్, సెప్టెంబర్ 4: తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా సోమాజిగూడ యశోద దవాఖానలో అత్యాధునిక పద్ధతిలో చీలమండ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం మీడియా సమావేశంలో సీనియర్ ఆర్థోపెడిక్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి వెల్లడించారు.
హైదరాబాద్కు చెందిన పంకజ్ గత సంవత్సరం జారి పడటంతో చీలమండకు తీవ్రగాయమైందని తెలిపారు. దానికి రక్త ప్రసరణ నిలిచిపోవడం తో కుళ్లిపోయిందని పేర్కొన్నారు. దీంతో ఆయన మరో కాలు చిలమండకు సీటీ స్కాన్ చేసి 3డీ ప్రింటెడ్ టైటానియంతో రూ పొందించిన చీలమండ మార్పిడి చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, గతంలో లాగా నడుచుకుంటూ అన్ని పనులు చేసుకోవచ్చని వివరించారు.