కోవిడ్ టెస్ట్: ఎలక్ట్రికల్ కిట్ రూపొందించిన హైదరాబాదీ పరిశోధకులు

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ కి చెందిన ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్.. కొత్త తరహా కరోనా టెస్ట్ కిట్‌ను డెవలప్ చేశారు. కోవీహోమ్ ఎలక్ట్రికల్ కిట్‌తో ఇంట్లోనే సులువుగా కోవిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌తో సమానంగా ఈ ఈ రిజల్ట్ ఉంటుందని ప్రొఫెసర్ శివ గోవింద్ తెలిపారు. కేవలం 30 నిమిషాల్లో కోవీహోమ్తో ఫలితాలు వస్తాయి. లక్షణాలు ఉన్నా, లేకున్నా ఆ ఫలితాల్లో తెలుస్తుంది. నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఈ పరీక్షను చేయవచ్చు ఆయన తెలిపారు. కోవీహోమ్ టెస్టింగ్ కిట్‌ను డెవలప్ చేసిన పరిశోధకుల బృందంలో డాక్టర్ సూర్యస్నాట త్రిపాఠి, సుప్రజా పట్ట, స్వాతి మోహంతితో పాటు ఇతర విద్యార్థులు కూడా ఉన్నారు.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గోవింద్ ఆధ్వర్యంలో ఈ కిట్‌ను తయారు చేశారు. చాలా చౌకైన ధరలో టెస్టింగ్ కిట్‌ను రూపొందించామని, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు చెప్పారు. అయితే భారీ స్థాయిలో కిట్లను ఉత్పత్తి చేసేందుకు భాగస్వామ్యుల కోసం చూస్తున్నామని ప్రొఫెసర్ తెలిపారు. కోవీహోమ్ కిట్‌తో ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ట్రయల్స్ నిర్వహించారు. ఈ కిట్ ధర రూ.400 గా నిర్ణయించారు. కిట్ వాడే విధానాన్ని ఈ వీడియోలో వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

