హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ):ఐఐటీ బాంబేకు చెందిన ఇంజినీర్లు హార్న్‌బ్యాక్ పేరుతో మడతపెట్టే (ఫోల్డింగ్) ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారుచేశారు. ఆ సైకిల్‌ను రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. తయారీ బృందం ఆవిష్కరణ, సృజనాత్మకతను ప్రశంసించారు. రాష్ట్రంలోని ఈ-వాహన విధానంలో ఈ సైకిల్‌ను చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ సైకిల్ అధిక వేగంతో వెళ్లగలదని, బ్యాటరీని సులభంగా మార్చుకోవచ్చని హార్న్‌బ్యాక్ రూపకర్తలు నిషిత్ పారిఖ్, రాజ్‌కుమార్ కేవట్ తెలిపారు. పది సెకన్లలో మడతవేయొచ్చని, సాధారణ సైకిల్ కన్నా సగం స్థలంలోనే పెట్టవచ్చని వివరించారు. సూట్‌కేస్‌లా లాక్కొని తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. త్వరలో తెలంగాణలో తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తామని వారు వెల్లడించారు.
