Akshaye Khanna | ధురంధర్ స్టార్, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కేవలం తన నటనతోనే మాట్లాడతారని, ఆయనతో కలిసి పనిచేయడం తనకు దక్కిన గౌరవమని ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ వర్మ ప్రత్యేక పోస్ట్‌ను పంచుకున్నాడు.
నిజమైన టాలెంట్‌కు అరుపులు అవసరం లేదని నిరూపించే నటుడు అక్షయ్ ఖన్నా. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్లాస్‌ను చాటుతాయి అని ప్రశాంత్ వర్మ కొనియాడారు. అలాగే ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగంగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ‘మహాకాళి’, ‘అధీర’, మరియు ‘జై హనుమాన్’ చిత్రాల గురించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని హింట్ ఇచ్చాడు. అక్షయ్ ఖన్నా ప్రస్తుతం ప్రశాంత్ వర్మ నిర్మిస్తున్న ‘మహాకాళి’ చిత్రంలో అసుర గురువు ‘శుక్రాచార్యుడి’ పాత్రలో నటిస్తున్నారు. ఇది ఆయనకు తెలుగులో తొలి చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం అక్షయ్ ఖన్నాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయిందని, అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేస్తున్న ఈ మైథలాజికల్ యూనివర్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Happy Birthday #AkshayeKhanna sir, a true actor who proves that real talent doesn’t need noise. Effortless screen presence, powerful performances, and unmatched class always stand out 🎭🎬
Its an absolute honour working with you. Can’t wait to show the world what we’ve created… pic.twitter.com/xiblaH8voc
— Prasanth Varma (@PrasanthVarma) March 28, 2026