హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తేతెలంగాణ): దేశంలో గేమింగ్, యానిమేషన్, డిజిటల్, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నట్టు కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజయ్జూజు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్(ఐఐసీటీ) ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని శనివారం హైదరాబాద్ హైటెక్స్ హెచ్ఐసీసీలో వేవ్స్ యానిమేషన్ బజార్ ఇండియా జాయ్ -25.. 8వ ఎడిషన్ ప్రారంభ ఈ కార్యక్రమంలో ప్రకటించారు. సదస్సులో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్‌రాజు, నటుడు తేజసజ్జా, తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు.