సిరికొండ, డిసెంబర్ 27: నిజామాబాద్ జిల్లా సిరికొండలో ఓ రైతు వ్యవసాయ మోటర్‌కు సంబంధించి విద్యుత్ బిల్లు కట్టకపోవడంతో ఎలక్ట్రిక్ సిబ్బంది కనెక్షన్ కట్ చేసి, స్టార్టర్ డబ్బాను తీసుకెళ్లారు. వ్యవసాయ మోటర్ విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటూ గ్రామంలోని సామాజిక మాధ్యమంలో వాయిస్ మెసేజ్ పంపిస్తూ హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ బోరుకు ఉచిత విద్యుత్, అందుబాటులో యూరియా అందగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ మోటర్ల కనెక్షన్ కట్‌చేసి, డబ్బాలు ఎత్తుకెళ్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.