తెలంగాణచౌక్, డిసెంబర్ 3: ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోకుంటే బుధవారం జరిగే సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపల్లి టూర్‌ను అడ్డుకుంటామని’ తెలంగాణ యునైటెడ్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్ ప్రెస్ భవనంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మద్దె రాజేందర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి స్కీంతో రాష్ట్ర వ్యాప్తం గా 7లక్షల 50వేల ఆటో డ్రైవర్ల జీవితా లు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాం గ్రెస్ మ్యానిఫెస్టో చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యత వహించాలని, ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుంటుంబాలకు రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా. వెయ్యి కోట్లతో ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చే యాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజైన ఈ నెల 7వచ్చిన రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేస్తామని, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.