అస్కీ, నల్సార్ మధ్య ఐదేండ్ల ఒప్పందం
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(అస్కీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్(నల్సార్) యూనివర్సిటీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ)/శామీర్‌పేట: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(అస్కీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్(నల్సార్) యూనివర్సిటీల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. సోమవారం హైదరాబాద్‌లోని అస్కీలోని బెల్లా విస్టా క్యాంపస్‌లో ఆస్కీ డైరెక్టర్ జనరల్, డాక్టర్ నిర్మల్య బాగ్చి, నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. టీచింగ్, ట్రైనింగ్, రిసెర్చ్‌లో మరింత సమర్థవంతంగా ముందుకెళ్లాలని ఇరువురు అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం ఐదేండ్ల పాటు కొనసాగుతుంది. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ఈ ఒప్పందం మెరుగైన విద్యబోధనకు సాధ్యమవుతున్నదన్నారు. సెమినార్లు, వర్క్‌షాప్‌లు, సమావేశాలు, ఉమ్మడి విద్యా కార్యకలాపాలు నిర్వహించడం సులభతరమవుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో అస్కీ, నల్సార్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ పీవీ రావు, డాక్టర్ వల్లి మాణిక్యం, కల్యాణ్ రాయ్, కే సుబోధ్, డాక్టర్ కర్ణక్ రాయ్, డాక్టర్ ఓంపాల్ సింగ్, రామ్ శిరీష్, పీవీ రావ్, డాక్టర్ వాగేషన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

