హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ఐసీఎస్ఈ (పదోతరగతి), ఐఎస్సీ (ఏడో తరగతి) 2023 ఫలితాలను ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను https://cisce.org లేదా https:// results.cisce.org వెబ్సైట్లలో చూసుకోవచ్చని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎడ్యుకేషన్ (సీఐఎస్సీఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ శనివారం తెలిపారు.
పాఠశాలల ప్రిన్సిపాళ్లు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగించి తమ విద్యార్థుల ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు. సందేహాలకు helpdesk@cisce.orgలో సీఐఎస్సీఈ హెల్ప్ డెస్ని, 18002032414 నంబర్లో సంప్రదించాలని కోరారు.