Vitamin D | ప్రతి ఐదుగురిలో ఒకరికి ‘డీ’ విటమిన్ లోపం.. కాలుష్యం, ఆధునిక జీవనశైలే కారణం!
దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు (49 కోట్ల మంది) ‘డీ’ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రి సెర్చ్ (ఐసీఆర్ఐఈఆర్) వెల్లడించింది. వారిలో దాదాపు 30% మంది పిల్లలు, యుక్తవయసులు ఉన్నట్టు పేర్కొన్నది. పురుషుల కంటే మహిళల్లో ‘డీ’ విటమిన్ లోపం ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంచేసింది.
- తాజా నివేదికలో ఐసీఆర్ఐఈఆర్ వెల్లడి
- రోజూ 20 నిమిషాలు సూర్యకాంతిలో ఉండాలని సూచన
Vitamin D | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు (49 కోట్ల మంది) ‘డీ’ విటమిన్ లోపంతో బాధపడుతున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రి సెర్చ్ (ఐసీఆర్ఐఈఆర్) వెల్లడించింది. వారిలో దాదాపు 30% మంది పిల్లలు, యుక్తవయసులు ఉన్నట్టు పేర్కొన్నది. పురుషుల కంటే మహిళల్లో ‘డీ’ విటమిన్ లోపం ఎక్కువగా ఉన్నట్టు స్పష్టంచేసింది. పట్టణాల్లో నివసించే మహిళల్లో 80% మంది విటమిన్ ‘డీ’ లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది.
‘డీ’ విటమిన్ లోపానికి కారణాలు
దేశంలో ఏడాది పొడవునా తగినంత సూర్యరశ్మి ఉన్నప్పటికీ కాలుష్యం పెరుగుదల, పట్టణీకరణ, ఆధునిక జీవనశైలి ‘డీ’ విటమిన్ లోపానికి దారితీస్తున్నట్టు ఐసీఆర్ఐఈఆర్ వెల్లడించింది. సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత బీ (యూవీబీ) రేడియేషన్ ‘డీ’ విటమిన్‌ను పొందేందుకు దోహదం చేస్తుందని, నగరాల్లో పెరిగిన వాయు కాలుష్యం ఆ రేడియేషన్‌కు అడ్డుపడి చర్మాన్ని తాకకుండా నిరోధిస్తుండటం ప్రజల్లో ‘డీ’ విటమిన్ లోపం పెరుగుదలకు ప్రధాన కారణమని వివరించింది. ఔట్‌డోర్ యాక్టివిటీస్ తగ్గడం ‘డీ’ విటమిన్ లోపానికి మరో కారణమని పేర్కొన్నది. దీన్ని నివారించాలంటే రోజూ కనీసం 20నిమిషాలు సూర్యకాంతిలో ఉండాలని స్పష్టంచేసింది. స్వీయ మందుల వాడకానికి దూరంగా ఉండాలని, ‘డీ’ విటమిన్ సప్లిమెంట్లను వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలని సూచించింది.
సమస్యలు ఇవీ..
‘డీ’ విటమిన్ లోపం నడుము నొప్పికి, ఎముకల్లో పగుళ్ల (ఫ్రాక్చర్స్)కు దారితీస్తుంది. ఈ సమస్యలపై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆర్థోపెడిక్ విభాగం 2019-21లో రెండు కీలక ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ (ఆర్సీటీ) అధ్యయనాలను నిర్వహించింది. వాటి వివరాలు ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామా’లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

