హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): నిమ్స్‌లో లైజన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మార్త రమేశ్‌ను ఐకాన్ అవార్డుతో ఐరా, అష్రా సంస్థల చైర్మన్లు రమేశ్, అలీఖాన్ సత్కరించారు. ఉప్పల్‌లోని ఫలని ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. వృత్తినే దైవంగా భావిస్తూ నిమ్స్‌కు వచ్చే రోగులకు రమేశ్ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరిత హారం విజయవంతం చేయడంలోనూ రమేశశ్ కీలక ప్రాత పోషించారని చెప్పారు. ఓ వైపు వృత్తిలో అంకితభావంతో పనిచేస్తూ మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా రమేశ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎల్ రమణ, సినిమా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డాక్టర్ మార్త రమేశ్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అవార్డు ప్రధానం చేయడం మరింత బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.